సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భారత్ ఫై విదించబోతున్న సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడి బెదిరింపులు, నేపథ్యంలో గత వారం దేశీయ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్‌మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. నేడు సోమవారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభం అయ్యింది. గత సెషన్ ముగింపు (83, 576)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 150 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా కోల్పోయింది. అయితే ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్ల నష్టంతో 83, 138 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 126 పాయింట్ల నష్టంతో 25, 556 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 352 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.24గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *