సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ‘బిగ్ బాస్ 7’ షో ఐదోవారం.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది సస్పెన్స్ గా మారిపోయింది. అదే సమయంలో ఆరుగురు కొత్తవాళ్లు కూడా హౌసులోకి ఎంట్రీ ఇవ్వ బోతున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇలాం టి టైం లో ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి హౌస్ నుండి డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం . మరి ఆ ఇద్దరు అమ్మాయిలేనట. ఓటింగ్లో గత శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్ లో ఉన్నాడు. ప్రియాంక చివర్లో ఉంది. అయితే ఈ ఆదివారం సర్ ప్రైజ్ ఉందని హౌసులో ఉన్న వాళ్లం దరికీ నాగ్ చెప్పాడు. ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అని బయట అందరికీ తెలిసిపోయింది. అలానే వారి పేర్లు .. అర్జున్ అంబటి, కెవ్వు కార్తీక్, పూజామూర్తి, నయని, పావని, అశ్విని శ్రీ, భోళే షావలే.. వీళ్లని తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున ఇచ్చిన టాస్క్ లో భాగంగా తేజ, ప్రియాంక, శుభశ్రీ ఫైనల్ అయ్యారని.. అయితే వీళ్లలో తేజ సేవ్ కాగా శుభశ్రీ-ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ అయ్యారని అనధికార సమాచారం. అలానే ప్రియాంకని పూర్తిగా బయటకు పంపేయకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం . మరి దీనిపై క్లారిటీ రావాలంటే కాస్త నిరిక్షించవలసిందే..
