సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి పాకిస్తాన్ రెచ్చగొడితే (సరిహద్దు ఉద్రిక్తతలపై) భారత్ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం లో భారత సైనిక శక్తి గతంలో కన్నా వేగంగా ధీటుగా ప్రతిస్పందించగలదని అమెరికన్ ఇంటిలిజెన్స్ కమ్యూనిటీ తాజా రిపోర్ట్ లో అభిప్రాయపడింది. ‘భారత్ వ్యతిరేక ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్ కు ఉంది. కశ్మీర్లో అశాంతి వంటి అంశాలు ఈ అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రికత్తలను పెంచుతున్నాయి’అని పేర్కొంది. ఇక తాజగా.. యూఎస్ కాంగ్రెస్కు సమర్పించిన నివేదికలో భాగంగా భారత్ కు సరిహద్దు ముప్పులపై తన అంచనాలను ప్రకటించింది. ‘సరిహద్దు సమస్య ను పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ద్వై పాక్షిక చర్చలు జరుతున్నాయి. కానీ, 2020లో జరిగిన గల్వా న్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. సరిహద్దు వద్ద పెరిగిన సైనిక మోహరిం పులు ఈ అణుశక్తుల మధ్య ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అది యూఎస్ ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చు ’ అని ఆ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో యూఎస్ జోక్యం చేసుకోవాలని పేర్కొంది. వాస్తవాధీన రేఖ వద్ద స్వల్ప స్థాయి ఆకస్మిక ఘర్షణలు అవకాశం ఉండొచ్చని తెలిపింది.
