సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు . ఈ సందర్భముగా రఘురామా మాట్లాడుతూ.. ఈసారి తెలుగుదేశం పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని స్వర్గీయ ఎన్టీఆర్ కు తప్పనిసరిగా కేంద్రం నుండి భారత రత్న ప్రకటింప చెయ్యాలని భావించానని, నిజానికి భారత రత్న బిరుదు కే స్వర్గీయ ఎన్టీఆర్ స్థాయి పెంచే వ్యక్తి అని, అటువంటి ప్రజల మనస్సులు గెలుచుకున్న నటుడు, ఎటువంటి లోటు బడ్జెట్ లేకుండా ప్రజలకు ఎన్నో పధకాలు అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఘన నివాళ్లు అర్పించారు .
