సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మా స్టార్ టివి ఛానెల్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ లు ఎంతటి ప్రేక్షక ఆదరణ సాధించాయో అందరికి తెలిసిందే.. అయితే గత 8 వ సీజన్ కు ప్రేక్షకులు కరువయ్యారు. అందుకే కొత్త హంగులతో 2 హౌస్ లతో కలపి బిగ్ బాస్ సీజన్ 9 (BIGG BOSS 9 Telugu) నేడు, ఆదివారం సాయంత్రం నుండి రియాల్టీ షో ప్రారంభం కానుంది. తాజాగా అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ గ్రాండ్ లాంఛ్ ప్రోమోను విడుదల చేశారు. గతం కంటే ఈ సీజన్ మరింత గ్రాండ్‌గా, ఎవరూ ఊహించని విధంగా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ఈ ప్రోమోలో సెలెబ్రెటీలను మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇటీవల శ్రీముఖి హోస్ట్‌గా నవదీప్, అభిజిత్, బిందు మాదవి జడ్జిలుగా వ్యవహరించిన షో ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’. ఇందులో ఫైనలిస్ట్‌లుగా నిలిచిన టాప్ 13 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ స్టేజ్‌పై చూపించారు.
