సిగ్మాతెలుగు డాట్, న్యూస్: దేశం అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సుమారు 7న్నర కోట్ల ఓటర్లు ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనే విషయాన్ని ఆయన తాజగా ధృవీకరించారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ కంచుకోట అయిన రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే ఊహాగానాలకు తెరదించారు. ఇది ఒక రకంగా ఎన్డీయే కూటమికి లబ్ది చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తాజగా మీడియా తో మాట్లాడుతూ.. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. దానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. రఘోపుర్లో తేజస్వీ యాదవ్పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించామన్నారు.( చంచల్ సింగ్ అనే సాధారణ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు. ) ఒకవేళ తాను పోటీలో ఉంటే.. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్లే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఈసారి ఎట్టి పరిస్థితులలో నితీష్ కుమార్ సీఎం కాలేరు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని ప్రశాంత్ కిశోర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
