సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సంక్రాంతి పండుగ రోజులు అంటే ఎంత మక్కువో అందరికి తెలిసిందే.. కుటుంబానికి ఎన్ని వేల కిలో మీటర్లు దూరంలో ఉన్న ఆ పండుగ రోజులలో తమ మూలాలు ఉన్న ఇంటికి చేరుకొని అయిన వారితో గడిపితే ఆ ఆనందమే వేరు.. సరిగ్గా ఇదే వారి బలహీనతగా భావించి ప్రెవేటు ట్రావెలర్స్ కొందరు ప్రయాణికులను దోచుకోవడం ప్రతి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి మరింత ఎక్కువ గా దొరికినకాడికి దోపిడీ జరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల తో సహా అన్ని టికెట్స్ అడ్వాన్స్ హౌస్ ఫుల్..మహిళలకు ఉచిత బస్సు పధకం ప్రభావం అనుకుంటా.. ఈసారి గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు సర్వీసులు గతంతో పోల్చుకొంటే బాగా తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ప్రైవేట్ ఆపరేటర్ల భారీ లాభాల పంట పండింది. టాక్సీ లతో పాటు ప్రెవేటు బస్సు లు, స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు.తెలంగాణ హైదరాబాద్ నుండి సాధారణ రోజుల్లో భీమవరం నుంచి స్లీపర్ ధర సుమారుగా రూ.1,500, సీటు రూ.700 ఉంటుంది. స్పెషల్స్ పేరిట ఆపరేటర్లు ఏసీ బస్సు స్లీపర్‌కు 3000- రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఇటీవల.. అయితే మాములు సిటు కే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు పెంచేశారు. ఇక స్లీపర్ 5వేల వరకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. తిరుగు ప్రయాణాలకు ఇంకా ధరలు పెంచే అవకాశం కూడా కనపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు వంటి అన్ని ప్రాంతాలకు దాదాపు ఇదే స్థాయి దోపిడీ జరుగుతుంది. కొందరు ప్రెవేట్ ఆపరేటర్స్ మాత్రం నిజాయితీగా వ్యవహరించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వ నిఘా పెడితే కొంత దోపిడీ అయిన అరికట్టినట్లు అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *