సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలయ్య ప్రత్యేక పాత్రలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా.అనే సినిమాలో 14 ఏళ్ళ క్రితం నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు కానీ.. బాలయ్య, స్పెషల్ రోల్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బాలయ్య హీరోగానయనతార జంటగా మలినేని గోపీచంద్ తెరకెక్కించే సినిమాలో మంచు మనోజ్ (Manoj) కీలక పాత్ర లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాని ఈ నెలలోనే సెట్స్ పైకి తీసుకు రానున్నారు. బాలయ్య, మలినేని గోపీచంద్ కాంబోలో గతంలో వీరసింహారెడ్డి అనే సినిమా రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో ఇప్పుడు రానున్న ఈ క్రేజీ కాంబో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
