సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రజలకు ముఖ్య గమనిక.. ఈనెల 7వ తేదీ శనివారం స్థానిక 2 టౌన్ లోని శ్రీ రామాపురం లోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సుబ్రమణ్య షష్ఠి వేడుకలు ఈ ఏడాది కేవలం స్వామి వారి దర్సనం చేసుకోవాలడానికే పరిమితం చెయ్యడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రకటించారు. కావున జిల్లాలోనే అత్యంత ఘనంగా 4 రోజులపాటు రోజు వేలాది భక్తుల సమక్షంలో జరిగే షష్టి వేడుకలు, భారీ తీర్ధం, ఎగ్జిబిషన్, రధోత్సవం, తెప్పోత్సవం వేడుకలు ఈ సారి జరగవు దేవాలయం పునర్ నిర్మాణం జరుగుతున్నా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా దీనిని గమనించాలి.
