సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల విద్య సంస్థలలో విద్యార్ధులకు సెప్టెంబర్ మూడోవారం నుంచి ఈసారి దసరా సెలవులు ఎక్కువగానే రానున్నాయి. ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు స్కూల్స్, పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ఇచ్చారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అటు తెలంగాణలో సెప్టెంబర్ 5న మీలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలీడే ఉంది.అలాగే ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 21 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలిడేస్ ఉండనున్నాయి. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్ధులకు భారీగా సెలవులు వస్తాయి.ఏపీలో ఇక ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజుల హాలిడేస్ వచ్చాయి.
