సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఈసారి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నిర్వహణ కు ముందు గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు తాజగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు గ్రాండ్ టెస్ట్ తేదీలు ప్రకటించారు. మార్చి 3న ప్రథమ భాష, 4న ద్వితీయ భాష, 5న ఇంగ్లీష్, 7న గణితం, 10న ఫిజికల్ సైన్స్, 11న బయలాజికల్ సైన్స్, 13న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించ నున్నారు. 6, 12 తేదీల్లో ఒకేషనల్, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా ఈ పరీక్షలు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ ముగిసిన మూడు రోజులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులంతా తొలిసారి ఇంగ్లీష్ మీడియంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ పరీక్షలు రాస్తున్నందున సన్నద్ధత కోసం మొదటిసారి గ్రాండ్ టెస్ట్‌ను ఏర్పాటు చేసారు.
