సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగిన నియోజకవర్గస్థాయి సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకోవాలనే తలంపుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అనేక కుట్రలు పన్నుతున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ కి అండగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను కచ్చితంగా గెలుచుకుంటామని ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రజలకు 600 కి పైగానే హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలను కూడా మోసం చేశారని, అందుకే 2019 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు కేవలం 23 సీట్లకే చంద్రబాబును పరిమితం చేశారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గుర్తు చేశారు. అయితే మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, అధికారంలోకి రావడానికి చంద్రబాబు లేనిపోని హామీలను ఇస్తున్నారని, చంద్రబాబు తోడుగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని విమర్శించారు. ఇక చంద్రయాన్ 3 విజయవంతం కావడం మన దేశానికే గర్వకారణం అని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేసారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
