సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్ (ఆర్జీయూకేటీ–ట్రిపుల్ ఐటీలు)లో ప్రవేశాలకు ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఎక్కువ మంది ఎంపిక అయ్యారు. సీట్లు సాధించిన వారిలో 76.97 శాతం మంది వీరే. ఇం దులో బాలికల శాతం 66.04. టాప్–3 ర్యాం కులు సాధిం చిన వారు కూడా ప్రభుత్వ విద్యార్థులే కావడం విశేషం . రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎం ట్రన్స్ ఫలితాలను విజయవాడలోని ఆర్జీయూ కేటీ చాన్సలర్ కేసీ రెడ్డి, ఉన్న త విద్యామండలి చైర్మ న్ ప్రొఫిసర్ .హేమచం ద్రారెడ్డితో కలిసి విద్యా శాఖ మం త్రి బొత్స సత్య నారాయణ విడుదల చేశారు. మంత్రి బొత్య మాట్లాడుతూ.. ఈసారి గ్రామీణ స్థాయి జెడ్ పి స్కూల్ విద్యార్థులు టాప్–3 ర్యాంకులు సాధించారని గ్రామీణ విద్యా ర్థులకు రాష్ట్రంలోని నాలుగు ఐఐఐటీల్లోప్రవేశాలు కల్పి స్తున్నా మని, 600 మార్కు లకు గాను అన్ని క్యాంపస్లలో 93 నుం చి 95 శాతం మార్కు లను కేటగిరీల వారీగా కటాఫ్ గా నిర్ణయించామని ప్రకటించారు. ఈసారి ఎస్టీ కేటగిరీలో అభ్య ర్థుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని అన్నారు. .అక్టోబర్ 12, 13 తేదీల్లోనూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్లలో, 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్ లో, ఇడుపులపాయలో, 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్ లో కౌన్సెలింగ్ నిర్వహించి, అక్టోబర్ 17 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *