సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ మరియు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల కోమటితిప్ప నార్త్, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, దిరుసుమర్రు మరియు యనమదుర్రు గ్రామాలలో నిర్వహించిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా వారు ఇరువురు మాట్లాడుతూ.. మీ ప్రాంతాలలో కోట్లాది రూపాయలు తో ఇంతటి అభివృద్ధి, కిలో మీటర్లు మేర కొత్త రోడ్డులు , డ్రైన్స్ వంతెనలు నిర్మాణాలు ఎవరి హయాంలో జరిగాయని ప్రశ్నించగా వారు సీఎం జగన్ వర్ధిలాలి..గ్రంధి శ్రీనివాస్ వర్ధిలాలి అని నినాదాలు చేసారు. రైతులకు, మత్యకారులకు ఎన్నో రకాల పధకాలు సంక్షేమ నిధులు నేరుగా వారి అకౌంట్స్ కే వేస్తున్నామని.. మరోసారి జగన్ సర్కార్ కు మద్దతుగా నిలబడాలని,కరోనా సమయంలో ఈ కూటమి ప్రధాన నేతలంతా హైదరాబాద్ లో ఇళ్లకు పరిమితం అయితే జగన్ సర్కార్ సాహసోపేతంగా ప్రజలను వాలంటీర్లు సహకారంతో ఆదుకోండని గుర్తు చేసారు. మరోసారి దొంగ హామీలతో చంద్రబాబు.. ఇక్కడి కూటమి నేతలు ఇస్తున్న దొంగ హామీలకు పడిపోతే ప్రజలకే నష్టం జరుగుతుందని, అటు అసెంబ్లీ, లోక్ సభ 2 ఓట్లు ఫ్యాను గుర్తుకు వేసి కనివిని ఎరుగని మెజారిటీతో మమ్ములను గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. తదుపరి నేటి .,ఆదివారం గూడూరి ఉమాబాల ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం గ్రామంలో పలువురు నాయకులు మరియు పెద్దలను కలసి వారి మద్దతును కోరారు. తదుపరి సాయంత్రం ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తో కలసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారు.
