సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సరైన వర్షాలు లేక ఉక్కపోత లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుభవార్త.. దక్షిణ కోస్తా పరిసరాల్లో గత శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు చెన్నై మీదుగా తూర్పు, పడమరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు కోస్తాపైకి వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల రుతుపవనాలు చురుగ్గా మారి ఈనెల 22 వరకు రాష్ట్రంలో ఈ వర్షాలు కొనసాగుతాయని వివరించారు. కాగా, ఈనెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు. గత రాత్రి నుంచి వర్షాలు కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయి. నేడు రేపు ( శని, ఆదివారాల్లో) కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఇప్పటికే గుంటూరు ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ రోజు శనివారం వాతవరణం కాస్త చల్లబడింది. అయితే ఉక్కబోత షరా మాములే.. ఎండల దెబ్బకు ఎండిపోతున్న నారుమళ్లు చూసి దిగాలు పడుతున్న రైతులకు ప్రస్తుతం వర్షాలు బాగా పడితే ఈ ఖరీఫ్ పంటలకు ప్రాణం లేస్తుంది.
