సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు నేడు, గురువారం కార్తీకామాసం ముగింపు సందర్భముగా దేవాలయ హుండీలు లెక్కించగా ఈ మాసంలో భక్తులు సమర్పించిన ధన కానుకలు రూ 25,13,766/-లు ఆదాయం రాగా, ఈ లెక్కింపు కార్యక్రమం లో, భక్తులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమతి కోడే విజయ లక్ష్మి మరియు ధర్మకర్తలు, దేవాలయ కార్యనిర్వహణాధికారి యమ్.అరుణ్ కుమార్ పాల్గొనగా జి సత్యనారాయణ కార్యనిర్వహణాధికారి, తాడేరు వారు పర్యవేక్షించినట్లు తెలిపారు. ఇక దేవస్థానం నకు ఈ కార్తీకమాసం సందర్భముగా దర్శనముల వలన, విరాళముల వలన, సేవల వలన, అన్నదానం విరాళముల వలన రూ.46,59,410/-లు ఆదాయం రాగ లడ్డు ప్రసాదములు అమ్మకం వలన రూ.4,34,310/-లు, హుండీలు వలన రూ.25,13,766/-లు మొత్తం రూ.76,07,486/- ఆధాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి.యమ్.అరుణ్ కుమార్, ప్రకటించారు. బహుశా ఈ దేవాలయ చరిత్రలో ఇదే మొదటిసారి ఇంతటి ఆదాయం అని భావించవచ్చు.. ఇక ఆర్టీసీ బస్సులకు ప్రత్యక పంచారామ బస్సుల ద్వారా ఆదాయం పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *