సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తుని మున్సిపాలిటీ లో అసలు బలం లేకపోయినా వైస్ చైర్మెన్ పదవిని ఎట్టి పరిస్థితి లోను దక్కించుకోవాలని వైసీపీ కౌన్సెలర్స్ లో ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ తమపై దాడులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ప్యూహాలకు ఎదురు ప్యూహాలతో వైసీపీ బలంగా ఎదురుకోవడంతో తునిలో పలుమారులు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి ఉప చైర్మెన్ ఎన్నిక ఏకంగా 4 సారులు వాయిదా పడటం అందరికి తెలిసిందే.. అధికార వత్తిడులు తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక దశలో 17 మంది మెజారిటీ వైసీపీ కౌన్సెలర్స్ సామూహిక రాజీనామాలు చేసేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో నేడు, సోమవారం వైసీపీ పార్టీకి చెందిన తుని ఛైర్‌పర్సన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనమ్ రేపింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం తన ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుధారాణి. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. సుధారాణి మాట్లాడుతూ..” మునిసిపల్ చైర్ పర్సన్ అయిన నా ఇంటిపై దాడి చేసి నాపై ఏ-1గా కేసు నమోదు చేశారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తునిలో రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడైనా మహిళపై ఏ-1గా కేసు పెట్టారా?. తునిలో బీసీ మహిళ.. ఎమ్మెల్యేగా ఉండి మరొక బీసీ మున్సిపల్ ఛైర్మన్ మీద కేసు పెట్టారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
