సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు. మంగళవారం తెనాలిలో సీఎం జగన్ పర్యటించారు. మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. 51వేలమందికి పైగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ 1,090. 76 కోట్లు బటన్ నొక్కి రైతుల అకౌంట్స్ లోకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా నిధులు ఇస్తున్నారన్నారు. ఈ నాలుగేళ్లకు రైతు భరోసా క్రింద రైతులకు 27,062 వేల కోట్ల రూపాయలు సాయంగా అందించామన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు మాటే లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా కరువే ఉండేదన్నారు. మేం వచ్చాక ఎక్కడా కరువు మండలం ప్రకటించే అవసరం రాలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఎప్పుడు వచ్చిన రాష్ట్రము అంతటా కచ్చితంగా కరువు వస్తుండేది అన్నారు. ఆర్బీకే విధానం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతులకు మేలు చేస్తుంటే టీడీపీకి కడుపు మండుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో . దోచుకో.. పంచుకో.. తినుకో.. అనేలా టీడీపీ పాలన ఉంటుందని జగన్‌ విమర్శించారు. అసలు టీడీపీ కానీ జనసేన గాని ఒంటరిగా రాష్ట్రంలో 175 స్థానాలకు పోటీ చేసే దమ్ము లేదు.. కానీ వీరి మాటలు చుస్తే..చంద్రబాబు దుష్ట చతుష్టయంలో దత్త పుత్రుడు చేరి రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు.వీరి అసూయ కు మందులేదు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *