సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వదినాలు ప్రారంభము అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ ఈ నెల 10 నుండి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.పవన్ రెండు మూడు రోజులు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పలు సమావేశాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముందుగా పిఠాపురం మున్సిపల్ హైస్కూల్‌లో జరిగే సభా కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.పిఠాపురం లేదా 10వ తేదీన గొల్లప్రోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం మండలం మల్లాంలోని గోకులం, విరవాడ, చేబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణలను, పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానాన్ని కలెక్టరు పరిశీలించారు. ప్రారంభోత్సవాల అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించే అవకాశం ఉంది.
