సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ తో పొత్తులలో భాగంగా ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాము అన్న దానిపై తాము అధికారిక ప్రకటన చేసే వరకు జనసేన నేతలు క్యాడర్ ఎక్కడ ప్రకటనలు చెయ్యవద్దని పవన్ కళ్యాణ్ తాజగా ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ నేడు, శనివారం ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్‌ కళ్యాణ్‌ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు, 14వ తేదీన భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్‌ పాల్గొననున్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో పవన్‌కళ్యాణ్‌ భేటీ కానున్నారు. స్థానిక టీడీపీ నేతలు ఆయనను కలిసే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *