సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ ఈ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3గంటలకు భీమవరం బైపాస్ రోడ్డులోని గ్రంధి వెంకటేశ్వరరావు కాలేజీ గ్రౌండ్ లో ‘ మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని స్థానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. వేలాదిగా ప్రజలు తరలివస్తారని సుమారు 50 వేల మంది వస్తారని భావిస్తున్నామని, ఈ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలని పార్టీ క్యాడర్ ను కోరారు. సీఎం జగన్ యాత్రతో భీమవరం నియోజకవర్గంలో ఇప్పటికే చేసిన అభివృద్ధి తో ప్రచారంలో దూసుకొనిపోతున్న పార్టీ కి ప్రజలలో మరింత బూస్టప్ పెరుగుతుందని, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగే సీఎం జగన్ సభలకు ప్రజలు, అభిమానులు విశేషంగా తరలివచ్చేందుకు వైసీపీ శ్రేణులు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *