సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఈ నెల 16న విజయవాడలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ పి.నరేష్ తాజగా ప్రకటించారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాలలో జరగనున్న ఈ జాబ్ మేళాలో ప్రఖ్యాతి చెందిన 15 పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, సుమారు 1000 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పదో తరగతి నుంచి ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థు లు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని, ఇతర వివరాలకు తెలుసుకోవడానికి సెల్ నెంబరు 90326 33548, 82477 66718లలో సంప్రదించాలని ప్రకటించారు.
