సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు మండి పోతున్నాయి. గోదావరి జిల్లాలో సైతం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. అయితే వడ కాల్పులు తీవ్రత మరింత పెరగనుంది. ఏపీ వాతావరణ శాఖ సూచనలు మేరకు ఈ ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు,ఎండ వేడిమి, వడ గాలుల తీవ్రత మరింత ప్రచండం కానుంది. కావున ప్రజలు ఆయా తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు (ప్రత్యేకంగా బహిరంగ ప్రదేశాలకు) వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో భూమి మీద నేరుగా 70% అతినీలలోహిత సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా అస్వస్థత కలిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచండి.తేలికైన దుస్తులు ధరించండి మొబైల్ వినియోగాన్ని తగ్గించండి, అధిక వేడి కారణంగా మొబైల్ పేలే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి పెరుగు, మజ్జిగ, నిమ్మ పండు రసం వంటి చల్లని9పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి.
