సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 19వ తేదీన ఏపీలోని పుట్టపర్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)ని దర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విమానాశ్రాయానికి ప్రధాని రానున్నారు. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ సభ మందిరంలో జయంత్యుత్సవాల సందర్భంగా సత్యసాయిబాబా మహా సమాధిని మోదీ దర్శించుకుంటారు. అదేవిధంగా 22వ తేదీన సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథి హోదాలో భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ‌న్ హాజరవుతారు. ఇప్పటికే ప్రధాని బందోబస్తులో భాగంగా 2500 మంది పోలీసు బలగాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *