సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:తెలుగు దేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా పర్య టన ఖరారైం ది. ఈ నెల 30వ తేదీ నుండి , వచ్చే డిసెంబర్ నెల 1, 2 తేదీల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ సభల ఏర్పా టుపై మం గళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్వహించారు. పర్యటన షెడ్యూలు ప్రకారం 30.11.22న ఉదయం కలపర్రు వద్ద పర్యటన ప్రారంభమై విజయరాయి వద్ద జరిగే సభలో పాల్గొంటారు. ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దెందులూరు, చిం తలపూడి నియోజకవర్గ సరిహద్దు గ్రామం రామచంద్రపురం రైతులతో మాట్లాడతారు. సాయంత్రం చింతలపూడి చేరుకుని రోడ్ షో నిర్వహిస్తారు. 1వ తేదీన చింతలపూడిలో బయలుదేరి తాడువాయి, బుట్టాయగూడెం మీదుగా రోడ్డుషో లు చేస్తూ పోలవరం చేరతారు. అక్కడి నుంచి రాత్రికి కొవ్వూరు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని రాత్రికి అదే పట్టణం లో బస చేస్తారు.2వ తేదీన కొవ్వూరులో బయలుదేరి రోడ్డు షో చేసుకుం టూ నిడదవోలు చేరుకుని బహిరంగ సభలో పాల్గొం టారు. అక్క డి నుం చి రోడ్డు షో లు చేసుకొంటు తాడేపల్లిగూడెం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.
