సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈ నెల 6వ తేదీ ఎల్లుండి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం పర్యటించనున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు కు సుమారు 13వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉండటంతో 70 శాతం పైగా పూర్తీ అయిన పోలవరం ప్రాజెక్టు పనులు ఉపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితి సమీక్షించడానికి షెడ్యూలు ప్రకారం ఈ నెల ఆరో తేదీ ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టుకు సీఎం జగన్ హెలికాప్టర్లో వస్తారు. లోయర్ కాఫర్ డామ్, అప్పర్ కాఫర్ డ్యామ్, స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ తదితర నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి, పనుల పురోగతిని తెలుసుకుంటారు. ప్రాజెక్టు సైటులోని సమావేశ మందిరంలో ఇరిగేషన్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తారు. అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లి బయలుదేరి వెళతారు. సీఎం పర్యటనలో పాల్గొనడానికి పశ్చిమ గోదావరి జిల్లా ycpనేతలు సమాయత్తం అవుతున్నారు.
