సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నెల 6వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ వైపు తుపాను ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల 6న వాయుగుండం ఏర్పడి 9వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర దిశగా కదిలే ఈ తుపాను ప్రభావం తో ఇటీవల తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలతో అల్లాడిపోతున్న వరి, మామిడి రైతులకు ఇది మరో పిడుగులాంటి వార్త గా భావించాలి. సముద్ర తీరంలో 50 కిమీ వేగంగా పెనుగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా మత్య్స కారులు సముద్రం లోకి వెళ్లొద్దని హెచ్చరించింది.ఈ తుపాను ఏర్పడితే దానికి ‘మోచా (Mocha)’ అని పేరు పెట్టనున్నట్లు ఐఎం డీ తెలిపింది.
