సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రిలీజ్ అయిన OG సినిమా ఘన విజయం సాధించిందని మేకర్స్ అభిమానులు కల్లెక్షన్స్ రికార్డ్స్ ప్రకటిస్తుంటే.. ఆ సినిమా విజయం సాధించలేదని ఆ కలెక్షన్స్ , రికార్డ్స్ అన్ని ఫేక్ అంటూ.. 2 వ రోజుకే థియేటర్స్ ఖాళీ అయ్యాయని, .. కలప దొంగలు సినిమాలు చెయ్యను అన్నవాళ్ళు మాఫియా రక్త పాతం సినిమాలు చేయవచ్చా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొందరు ట్రోలర్స్ దారుణంగా ట్రోల్ చేసున్నారు. దీనిపై OG సినిమా విజయోత్సవం లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి హీరోల అభిమానులకు చెప్తున్నా నేను అందరి హీరోలను అభిమానిస్తాను. ఎన్టీఆర్, ప్రభాస్, రామ చరణ్, చిరంజీవి గారు, నాని.. అందర్నీ అభిమానిస్తాను. వాళ్ళ వర్క్ ని గౌరవిస్తాను. నేను ఆర్ట్ ని ప్రేమించేవాడిని. ఒక వ్యక్తి ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడు అంటే మన మనసు సరిగ్గా లేదని అర్ధం. అందరి అభిమానులకు, నా అభిమానులతో కలిపి చెప్తున్నాను ఈ ఫ్యాన్ వార్స్ చేయడం ఆపండి. మేము అందరం కష్టపడి పనిచేస్తాము. పగలు రాత్రి లేకుండా, ఇంటికి వెళ్లకుండా పనిచేస్తాము. ఈ సినిమాలపై ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. గతంలో మీ ప్యాన్స్ చేసారు ఇప్పడు మేము చేస్తాము అంటూ ఈ ఫ్యాన్ వార్స్ లో సినిమాని చంపకండి. తిట్టుకుంటూ ఉంటే సమాజంలో అగ్లీ నెస్ పెరిగిపోతుంది. అందరికి నా రిక్వెస్ట్ ఇది. మీరెంత మారతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను మాత్రం అందరి హీరోల అభిమానులను అభిమానిస్తున్నాను అని అన్నారు.
