సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన ట్వీట్ లో..‘‘ టీడీపీ కార్యకర్తల కన్ను పొడిచిన వారికీ స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. నినాదాలకే హత్యాయత్నం కేసు… ఇలాంటి పోకడలతో పోలీసులు తాము ఎటువైపో స్పష్టం చేశారు? కుప్పంలో సాధారణ నిరసన తెలిపినవారిపై కూడా పోలీసులు హత్యాయత్నం సెక్షన్ పెట్టి రిమాండ్‌కు పంపారు. విజయవాడలో కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీల తీరు పోలీస్ శాఖ ప్రతిష్ఠకే మాయనిమచ్చ. ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు సాగిలపడటాన్ని ప్రజలు సమర్థించరు, ప్రజల నుంచి జీతాలు తీసుకుంటున్నది నిందితులను రక్షించడానికి కాదని పోలీసులు గుర్తించాలి’’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *