సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ మహానగరంలో శ్రీ వినాయక విగ్రహాల నిమజ్జనాల వేడుకలు నేటి, శనివారం మధ్యాహ్నం వరకు జరగనున్నాయి. నిన్న శుక్రవారం రాత్రికే ఈ కార్యక్రమం పూర్తీ కావలసి ఉన్నపటికీ భారీ వర్షాలు, రోడ్లపై వర్షపు మడుగులు కారణంగా ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర చాల ఆలస్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు కదిలిన ఖైరతాబాద్ మహా గణపతి రాత్రి 7 గంటలకు గణేష్ మహారాజ్ కీ జై’ అంటూ భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య తన భక్తుల కష్టాలను తనతో పాటు తీసుకొనివెళ్ళి పోతున్నాడు అన్నట్లుగా..మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహాగణపతి నిమజ్జన శోభాయాత్రలో దాదాపు 2 లక్షల మంది భక్తులు టాంక్ బండ్ పరిసరాలకు తరలి వచ్చారు. ఇక .క్రేన్ నెంబర్ 4 వద్ద నుండి ఎన్టీఆర్ మార్గంలో ఎక్కడ చూసినా ఖైరతాబాద్ గణేశుడి కోసం వచ్చిన భక్తులే కనిపించారు.అలాగే బాలాపూర్ గణేష్ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. బాలాపూర్ వినాయకుడి చేతిలోని లడ్డూ ప్రసాదాన్ని వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60లక్షలకు వేలంలో రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. బడంగ్‌పేటలో అందెల శిరీష రూ.12లక్షలకు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు.కర్మన్‌ఘాట్‌లో, మంచిరేవులలో కూడా లడ్డు ప్రసాదాలు వేలంలో 11 లక్షల పైగా పాడుకోవడం విశేషం.
