సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ చివరి 2 రోజులుకు చేరుకోవడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నేడు, మంగళ వారం నరసాపురం-సికింద్రాబాద్ మధ్య భీమవరం మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నారు. 07466 నెంబరుతో నరసాపురంలో సాయంత్రం ఆరు గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. గుంటూరు, సత్తెనపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా సికింద్రాబాద్‌కు మర్నాడు ఉదయం 4.10 గంటలకు చేరుకుంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకి వీడు రైల్వే స్టేషన్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది ప్రయాణికులు గమనించగలరు.
