సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఏకపక్ష తీర్పు ఇచ్చారని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఒకవేళ పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారని ఎద్దేవా చేసారు. మహారాష్ట్రలో నకిలీ శివసేన ప్రస్తుతం కాంగ్రెస్‌ పక్షాన నిలిచిందని.. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే బతికుంటే ఇదంతా చూసి బాధపడేవారని అన్నారు.‘ఈ ఎన్నికల్లో విపక్ష కూటమికి మూడంకెల సీట్లు కూడా రావు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి కూడా లేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల తర్వాత సీఎంను మార్చే ప్లాన్‌ చేస్తోంది. కర్ణాటక మోడల్‌ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలుచేయాలని భావిస్తోంది. ప్రజల సొమ్ము మింగేసే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ కూటమి రెండుసార్లు సెల్ఫ్ గోల్స్‌ వేసుకుంది. మూడో విడతలోనూ ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా ఓటర్లు మూడో గోల్‌ వేస్తారు అన్నారు ప్రధాని మోడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *