సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇక వరుసగా 2 నెలలు పాటు మంచి ముహుర్తాలు ఉండటంతో శుభవేడుకలు, పెళ్లి సందడులు తో కళకళలాడనుంది . ఇప్పటికే జిల్లా కేంద్రం భీమవరం లో అన్ని ప్రముఖ పంక్షన్ హాలులు, లార్జీ రూంలకు అడ్వాన్స్ బుకింగ్ పూర్తీ అయ్యింది. ప్రముఖ దేవాలయాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొంటున్నారు. పూర్తీ నిబంధనలు సండలింపుతో కరోనా తరువాత ఏకంగా రెండేళ్లకు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో డెకోరేటర్లు, ఫుడ్ క్యాటరింగ్, ఫంక్షన్ హాలు, వీడియో, ఫోటోగ్రాఫర్లకు , బ్యూటిష్యన్స్ కు, వస్త్ర వ్యాపారులకు , జ్యువెలరీ వ్యాపారులకు, టూరిస్టు వాహనాలుకు, వేలాది కార్మికులకు , పూల, పండ్ల వ్యాపారులకు చేతి నిండా పని , అమ్మకాలు జరుగుతాయి. ఇక మరో వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఈసారి వచ్చే 2 నెలలలో వందలాది పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు భీమవరంలో రంగం సిద్ధం అయ్యింది. దీపావళి తర్వాత మంచి ముహూర్తాలు డిసెంబర్, జనవరిలో ఉన్నా యి. దేశవ్యాప్తంగా దాదాపు లక్షన్నర వరకు పెళ్లిళ్లు జరుగుతాయని ఒక అంచనా.. వందల కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. దీనికి బోనస్ గా భీమవరంలో సంక్రాంతి సందడి..నెల రోజులు పాటు జరిగే శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ వేడుకలు.. ఇక చూసుకోండి..
