సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు ఉదయం 8 గంటల నుండి దంచికొడుతున్నాయి. అప్పుడే ఏపీలో చాల ప్రాంతాలలో 40 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి’ అయితే విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుండి చల్లటి వార్త వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో తేలకపాటి వర్షాలు కురుస్తాయని తాజగా ప్రకటించింది. రేపు శనివారం ఈ వర్షాలు కురుస్తాయని వివరించింది.దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీన పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రాలో వర్షాలు పడతాయి. రాయలసీమలో కూడా ఓ మోస్తరు కురుస్తాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే మరో మూడు రోజుల అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని పేర్కొంది. అయితే వర్షాలు పడిన తర్వాత ఎండల తీవ్రం ను ప్రజలు ఎదుర్కోవలసి ఉందన్నమాట..
