సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత మొదలు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత గత వేసవి రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని, ఈ మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని అంచనా వేసింది. ఈసారి శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భానుడి భగభగలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎండల తీవ్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *