సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 14న సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విఫ్ మరియు స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మరియు కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో ఇప్పటికే పర్యటన ఏర్పాట్లు, షెడ్యూలు ఫై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ కార్యా లయం లో సమీక్షలు జరిగాయి. నరసాపురం పర్యటనలో భాగంగా (నరసాపురం పరిసర ప్రాంతాలలో ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నా ) ఫిషింగ్ హార్బర్, వాటర్ గ్రిడ్, ఆక్వా యూనివర్సిటీ, రెగ్యులేటర్ కం బ్రిడ్జి పనులకు శంకుస్థాపన కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాట్లను ఎస్పీ యు.రవి ప్రకాశ్, జేసీ జేవీ మురళీ, సబ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, భీమవరం ఆర్డీవో దాసి రాజు పర్యవేక్షిస్తున్నారు. నరసాపురం సరిహద్దు నియోజకవర్గాలు అయిన భీమవరం ,పాలకొల్లు నుండి వైసిపి ప్రజా ప్రతినిధులు, వైసీపీ క్యాడర్ ,జిల్లా ఆక్వా ప్రముఖులు ఇప్పటినుండే ఈ నెల 14న సీఎం జగన్ సభకు వెళ్ళటానికి , ఆయనతో వ్యకిగతంగా కొద్దీ సమయం అయిన కలసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొనిపోవడానికి తగు ప్రణాళికలలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *