సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టౌన్ హాలులో నేడు, బుధవారం ఏపీ మునిసిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతల మీడియా సమావేశంలో ..ఏపీ రాష్ట్ర అడ్జక్షుడు ఎస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర స్థాయి మున్సిపల్ ఉద్యోగ నాయకుల సర్వసభ్య సమావేశం భీమవరం టౌన్ హాలులో జరుగుతుందని ప్రకటించారు. ఈ సమావేశంలో తమ సమస్యలపై చర్చతో పాటు.. నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతాయని దీనికి రాష్ట్ర స్థాయిలో నేతలే కాకుండా తెలంగాణ నుండి కూడా ఉద్యోగ సంఘ నేతలు పలువురు ఆహ్వానితులుగా వస్తున్నారని తెలిపారు, కావున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మినిస్ట్రియల్ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని దీనికోసం పలు రీజనల్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీ ఉదయం 8గంటలకు స్థానిక శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొని తదుపరి భారీ ర్యాలీగా రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ నేతలు టౌన్ హాలుకు చేరుకొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 9491524455 ను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *