సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక 2 రోజుల తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూటమి సర్కార్ అందించనుంది. స్త్రీ శక్తి’ పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నారు. అయితే కొన్ని షరతులు పెట్టారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఉన్న 5 కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించారు. మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్‌ జెండర్లు కూడా తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు.అదే సమయంలో తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం వర్తించదు. వాటితో పాటు నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదని ప్రభుత్వ స్పష్టం చేసింది. ఇక ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన ఇతన క్యాటగిరిలకు చెందిన సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ‘స్త్రీ శక్తి’ పథకం వర్తించదు. కాగా స్ర్తీ శక్తి పథకాలన్ని ఆగస్టు 15న సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనుండగా ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *