సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో ఈ నెల 15,16 తేదీల్లో వికాస కార్యాలయంలో ఏఐ కంపెనీలో వాయిస్‌(కస్టమర్‌ సర్వీస్‌ అడ్వయిజర్‌), నాన్‌ వాయిస్‌(డిజిటల్‌ చాట్‌ అసోసియేట్‌) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజె క్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్‌, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 30ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పై తేదీల్లో ఉదయం 9 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరు కావాలి. వీరికి సంవత్సరానికి రూ.2.4లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌ ఆయా ఉద్యోగాల ఆధారంగా ఉంటుందన్నారు. పూర్తీ వివరాలకు సెల్‌ నెంబర్లు 7799376444, 7799376111 ను సంప్రదించవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *