సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగునాట భక్తులకు కొంగుబంగారం .. భీమవరం పురాధీశ్వరి, మహిమాన్వితమైన శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జనవరి నెల 13 వ తేదీ నుండి నెల రోజులు పాటు అత్యంత వైభవముగా జరగనున్న వార్షిక (సంక్రాతి) మహోత్సవాలు నేపథ్యంలో శ్రీ మావుళ్ళమ్మ తల్లి గర్భాలయం లో మరమ్మత్తులు, శుద్ధి.. శ్రీ అమ్మవారి మూలవిరాట్ కు నూతన అలంకరణ తదితర పనులు నిమిత్తం..ఈ నెల 17 వ తేది బుధవారం నుండి గర్భాలయం లో దర్శనాలు నిలుపుదల చేయడం జరుగుతుంది అని (తేది.17-12-2025 నుండి ది. 29-12-2025 వరకు),అయితే భక్తుల దర్శనాల కోసం శ్రీ అమ్మవారి యొక్క కళలను కలశంలోకి ఆవాహన చేసి శ్రీ అమ్మవారి గర్భాలయం వెనుక ప్రదక్షిణ మండపంలో బాలాలయం ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహమునకు పూజాదికములు యథావిధిగా జరుగుతాయని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు..
