సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 22వ తేదీ సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు భేటీ అయ్యారు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా అధికారులందరూ ప్రిపేర్ కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు సభ ముగియనుంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సభలో చంద్రబాబు సర్కార్ మూడు అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. మరి ఈసారి అయిన ప్రతిపక్ష నేత జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి హాజరు అవుతారా? లేదా అన్న సస్పెన్సు కొనసాగుతుంది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వైసీపీ నేత రషీద్ తో పాటు రాష్ట్రంలో జరుగుతున్నావిద్వంసం , దాడులు ఫై అసెంబ్లీ లో వైసీపీ గళం విప్పితే మంచిదని ఆ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.
