సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 23వ తేదీన విజయవాడ – రాజమండ్రి మధ్య రైల్వే లైన్ లలో ఆపరేషనల్ వర్స్క్ జరుగుతున్న నేపథ్యంలో ఐదు కీలక రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైల్ నెంబర్ 17257 విజయవాడ- కాకినాడ పోర్టు, 17258 కాకినాడ పోర్టు – విజయవాడ, 17250 కాకినాడ టౌన్ – తిరుపతి, 17249 తిరుపతి – కాకినాడ టౌన్, 67202 విజయవాడ – రాజమండ్రి నడిచే రైళ్లను రద్దు చేశారు. దీనితో గోదావరి జిల్లాల ప్రయాణికులకు కొంత ఇబ్బంది తప్పదు
