సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పిల్లలకు ఆధార్ లో బయో మెట్రిక్ అప్ డేట్ చెయ్యడానికి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అందరికి తెలిసిందే.. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు దీపావళి పండుగ తరువాత ఈ నెల 23 నుంచి 30 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో 16 న్నర లక్షల మందికి పైగా పిల్లల బయోమెట్రిక్‌లను ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. పేరు, పుట్టిన తేదీ మార్పులకు ఛార్జీలు పెరిగినా, పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ మాత్రం ఉచితం. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *