సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ సెప్టెంబర్ నెల 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ల కు వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సూచించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా లో అధికారులతో సమావేశం అయ్యి ఎట్టి పరిస్థితులలో ఈ నెల 25వ తేదికి ఓటర్లు లిస్ట్ లో మార్పులు చేర్పులు పారదర్శకంగా పూర్తీ చెయ్యాలని ఆదేశించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇంటింటి సర్వే, జంక్‌ క్యారెక్టర్స్‌ను సవరించి పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2022 జనవరి 6 నుంచి 2023 మార్చి 31 వరకు తొలగించిన ఓట్లకు సంబంధించిన రీవెరిఫికేషన్‌ ఈనెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *