సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 29న భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే జాబ్ మేళాను భీమవరం నియోజక వర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పిలుపు నిచ్చారు. నేడు బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడుతూ.. యువతకు . ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారని, ఈ జాబ్ మేళాలో సుమారు 28 ప్రముఖ కంపెనీలతోపాటు మరికొన్ని ఇతర కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ కంపెనీలలో మొత్తం 3 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని, 18 – 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని, మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. మరెన్ని వివరములకు ఈ నెంబర్లను 86885 95244, 95020 24765 సంప్రదించవచ్చునని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *