సిగ్మాతెలుగు డాట్, న్యూస్: గత కొన్ని ఏళ్లుగా సరైన హిట్ లేక వెనుకబడిన నేచురల్ స్టార్ నాని హీరోగా , కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ ‘దసరా’ సినిమా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఈ మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యుబైఏ (U/A Certificate) సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అయితే సెన్సార్ నుంచి మాత్రం ఈ చిత్రానికి భారీ కట్స్ తో షాక్ ఎదురైనట్లుగా భావిస్తున్నారు, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ సినిమాకు కట్స్ విధించడంతో.. ప్రస్తుతం ఈ విషయంలో ‘దసరా’ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది.ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఫస్టాఫ్ 20, సెకండాఫ్‌లో 16.. మొత్తంగా 36 కట్స్‌ని బోర్డు విధించినట్లుగా భావిస్తున్నారు, బూతు పదాలను మ్యూట్ చేయాలని, అలాగే ధూమపానం, మద్యపానంకు సంబంధించి వచ్చే డిస్క్లైమర్ ఫాంట్‌ను పెద్ద సైజ్‌లో చూపించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, హింసాత్మక సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని సూచిస్తూ.. చిత్రానికి యుబైఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా సమాచారం.
