సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కృష్ణ జిల్లాలోని ఆక్వా వ్యవసాయం ( రొయ్యలు, చేపల సాగు..) చేసే రైతులకు విద్యుత్తూ తదితర ప్రభుత్వ సబ్సిడీలు అందించేందుకు అర్హత కలిగిన రైతుల చెరువులకు సంబంధించి .. ఇటీవల ప్రభుత్వ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ లోపు అర్హత కలిగిన ఆక్వాజోన్‌ విస్తీర్ణాన్ని గుర్తించి ఆన్‌లైన్‌ చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రి సర్వే లో జరిగిన లోపాలు ఈసారి జరగకూడదని అధికారులకు ఆదేశాలు అందాయి. దీనితో .ప్రభుత్వం డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ కమిటీ చైర్మన్‌ అయిన ఆయా జిల్లాల కలెక్టర్‌ ద్వారా ఈ నెల 30వ తేదీ లోపు స్థానిక మత్స్యశాఖ అధికారుల నుంచి ఎల్‌పీ నెంబర్లు లేకుండా ప్రతీ రైతుకు ఆక్వాజోన్‌ అనుమతులు మంజూరు చేసేందుకు ఆన్‌లైన్‌ డేటా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. దీంతో పాత పద్ధతిలోనే ఆక్వాజోన్‌ పరిధి లోకి అన్ని చెరువులు వస్తాయి. దీనివల్ల రైతులకు మత్స్యశాఖ అనుమతులు ప్రభుత్వ సబ్సిడీ, ఇతర పధకాలు యథావిధిగా రైతులకు అందుతాయని అడ్డంకులు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *