సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:శు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 వ తేదీన ప్రారంభమైన.. ఈనెల 31వ తేదీ వరకు భీమవరంలో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ ను భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఆవిష్కరించారు. ఈనెల 31 వరకు పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహనా సదస్సులు జరుగుతాయని అన్నారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని పశువైద్యశాలలో గాని లేదా రైతు సేవా కేంద్రంలో గాని సంప్రదించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ భీమవరం డివిజన్డిప్యూటీ డైరెక్టర్ డా జవర్ హుస్సేన్, భీమవరం అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్ బాబు, మండల వైద్యాధికారి పీ పుండరీ బాబు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *