సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో మినీ శిర్దిగా ప్రసిద్ధి పొందిన స్థానిక 24వ వార్డులోని శ్రీ షిరిడి సాయి ససంఘ ఆశ్రమం ట్రస్ట్ వారి శ్రీఅభయసాయి ధ్యాన మందిరంలో 32 వ వార్షిక మహోత్సవాలు కు సాయి భక్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం నుండి 11 వ తేదీ మంగళవారం వరకు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా ప్రతి రోజు బాబావారి వేద పండితులతో రుద్రాభిషేకలు, తులసిదళం, చామంతి పుష్పాలతో విశేషార్చన నిర్వహిస్తారు. 9వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ సాయినాధుని హోమం , మరియు 11 వ తేదీ ఉదయం నుండి శ్రీ బాబా వారికీ అన్నాభిషేకం తదుపరి మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
