సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్‌ ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీలు బీసీల జపం చేస్తారు తప్ప చేసిన మేలు ఏమి లేదని స్వాతంత్య్రం సిద్దించి 76 ఏళ్లు గడిచినా బీసీలకు అన్ని రంగాల్లో సముచిత న్యాయం జరగలేదని ఈమేరకు సమస్యలపై చర్చించేందుకు ఈనెల 10న ఏలూరు డీసీఎంఎస్‌ కల్యాణమండపంలో రాష్ట్రస్థాయి బీసీ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 24.5 శాతం రిజర్వేషన్‌ తగ్గించడంతో 16 వేల మంది పదవులకు అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ తీసుకు వచ్చిందని దీనికి టీడీపీ, వైసీపీ మద్దతు తెలిపి బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ వాణి, బాణి వినిపించేందుకు బీసీలు సారథ్యం కావాలన్నారు. జనగణనలో సమగ్ర కులగణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జాతీయ మత్య్సకార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గంటసాల వెంకటలక్ష్మి, బీసీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కోమటి రవి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతినిధుల సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *